Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హిందుస్తాన్‌ యూనీలీవర్‌తో పిజ్జా హట్‌ భాగస్వామ్యం

హైదరాబాద్‌ : మునుపెన్నడూ లేని విధంగా తమ దిగ్గజ ప్యాన్‌ పిజ్జా అనుభూతిని సమర్పిస్తూ, పిజ్జా హట్‌ ఇప్పుడు హిందుస్తాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యుఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా అత్యుత్తమంగా అమ్ముడయ్యే క్వాలిటీ వాల్స్‌ ఐస్‌ క్రీమ్‌, డిస్సర్ట్లను తమ డైన్‌-ఇన్‌ అలాగే డెలివరీ, టేక్‌అవేల మెనూలో చేర్చనుంది. ఈ ఒప్పందం ద్వారా, తమ సొంత, సహచర వేదికల ద్వారా ఐస్‌ క్రీమ్‌లు, డిస్సర్ట్లను అందించే మొట్టమొదటి పిజ్జా క్యూ.ఎస్‌.ఆర్‌ శ్రేణిగా పిజ్జా హట్‌ అవతరించనుంది. క్వాలిటీ వాల్స్‌ ఐస్‌ క్రీమ్‌ అండ్‌ డిస్సర్ట్లను కలిగిన ఆర్డర్లతో తమ సగటు ఆర్డర్ల విలువ దాదాపు 10% పెరుగుతుందని ఈ బ్రాండ్‌ భావిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా, పిజ్జా హట్‌ తమ కస్టమర్లను రుచికరమైన యాడ్‌-ఆన్లతో ఆనదింపజేయడాన్ని కొనసాగించనుంది అలాగే తమ బ్రాండ్‌ పెరుగుదలకు ఎంతో ముఖ్యమైన డెలివరీ ఛానెల్ను మరింత బలపరుచుకోనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img