Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కొత్త నియామకాలు


ముంబయి: భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యువ గ్రాడ్యుయేట్‌లను ఒక ఏడాది లోగా బ్యాంకింగ్‌ నిపుణులుగా మార్చేందుకు భారతదేశ వ్యాప్తంగా రిక్రూట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌గా ఫ్యూచర్‌ బ్యాంకర్స్‌ 2.0ని ప్రారంభించిందిలి. మణిపాల్‌ గ్లోబల్‌ అకాడమీలోని బీఎఫ్‌ఎస్‌ఐతో అందుబాటులోకి తీసుకు వచ్చిన ఫ్యూచర్‌ బ్యాంకర్స్‌ 2.0 అనేది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రిటెయిల్‌ బ్యాంకింగ్‌ వ్యాపారం కోసం ఒక దృఢమైన, ఫ్యూచర్‌-రెడీ టాలెంట్‌ పైప్‌లైన్‌ను రూపొందించే లక్ష్యంతో ఒక-ఏడాది అవధి ఉండే ప్రొఫెషనల్‌ డిప్లమో కోర్సు. ఫ్యూచర్‌ బ్యాంకర్స్‌ 2.0 తరగతి గది సెషన్‌లు, గెస్ట్‌ లెక్చర్లు, బృంద చర్చలు, రోల్‌ ప్లేలు, ఫీల్డ్‌ వర్క్‌ల అద్భుతమైన మిశ్రమాన్ని అందిస్తుంది. దీనితో పాటు, బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, ప్రక్రియలు, కాంప్లియెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌, రోజువారీ బ్యాంకింగ్‌ కార్యనిర్వహణలో విద్యార్థుల గ్రౌండిరగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు దేశంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బ్రాంచ్‌ స్థానాల్లో ఈ కార్యక్రమం ఎనిమిది నెలల చెల్లింపు ఇంటర్న్‌షిప్‌తో పాటు ఉద్యోగ శిక్షణను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img