Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్మార్ట్‌ పెన్షన్‌ ప్లస్‌’ ప్రారంభం

ముంబై: భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇప్పుడు కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్మార్ట్‌ పెన్షన్‌ ప్లస్‌ ప్రారంభించింది. ఇది రిటైర్మెంట్‌ తర్వాత వినియోగదారులు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించడానికి వీలుగా రూపొందించిన ప్లాన్‌. ఇది దాదాపుగా ‘జీతం’ లాగే సాధారణ, గ్యారెంటీడ్‌1 స్ట్రీమ్‌ రూపంలో ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న రోజుల్లో ఎలాంటి జీవన శైలిని గడిపారో రిటైర్మెంట్‌ తరవాత అదే తరహా జీవన శైలిని కొనసాగించాలని ఎవరైతే కోరుకుంటారో.. సరిగ్గా అలాంటి వారికోసం రూపొందింది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్మార్ట్‌ పెన్షన్‌ ప్లస్‌. ఇప్పుడు పొదుపు చేసి, రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రత కోసం పెద్ద మొత్తం దాచుకుని రిటైర్మెంట్‌ తర్వాత గడిపే సంవత్సరాలు బంగారంలా ఉండాలని ప్లాన్‌ చేసే వ్యక్తులకు ఇది అన్ని విధాలా అనువైనది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img