Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హైదరాబాద్‌లోకి ప్రవేశించిన హౌజర్‌

హైదరాబాద్‌ : భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కో-లివింగ్‌ బ్రాండ్‌ హౌసర్‌ సహ-జీవన ప్రదేశాలకు సంబంధించి తన ప్రణాళికలను విస్తరిస్తోంది. సరళమైన నిబంధనలు, సమాజ భావన, సురక్షితమైన జీవనాన్ని అందించే సరసమైన వసతి కోసం డిమాండ్‌ క్రమంగా అధికమవుతోందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. కంపెనీ తన 2 కొత్త ప్రాపర్టీలను హైదరాబాద్‌ కీలక ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ (హైటెక్‌ సిటీకొండాపూర్‌)లో ఆవిష్కరించింది. డిసెంబర్‌ 2021 నాటికి హైదరాబాద్‌లో 9-10 ప్రాపర్టీలకు విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు బోటిక్‌ ప్రాపర్టీలను దాని పోర్ట్‌ఫోలియోలో చేర్చడంతో, ప్రస్తుతం, హౌసర్‌ దిల్లీ ఎన్సీఆర్‌, పుణె, హైదరాబాద్‌ అంతటా 20ం ఆస్తులను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా వచ్చే 6-9 నెలల్లోమరిన్ని ప్రాపర్టీలను వేగవంతంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందని హౌసర్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపక్‌ ఆనంద్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img