Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

100 కొత్త శాఖలను ప్రారంభించిన హెచ్‌డీఎఫ్‌సీ

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారతదేశ వ్యాప్తంగా 100 కొత్త శాఖలను ప్రారంభించానని ప్రకటించింది. ఈ కొత్త శాఖలు 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 83 నగరాలు/పట్టణాలలో ప్రారంభించింది. ఈ శాఖలు సుమారుగా 50% మేర చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. కొత్త శాఖలకు బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ డిజిటల్‌ విధానంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని సీనియరు బ్యాంకు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రిటెయిల్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ గ్రూపు హెడ్‌ అరవింద్‌ వోహ్రా మాట్లాడుతూ, తమ వినియోగదారులకు భౌతిక శాఖల కేంద్రాలు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల సంయోజన ద్వారా వినియోగదారులకు సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 425 రిటెయిల్‌ శాఖలు, నాలుగు డిజిటల్‌ బ్యాంకింగ్‌ కేంద్రాలను ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img