Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

15 నుంచి ఇండియా ల్యాబ్‌ ఫార్మా ప్రో ఎక్స్‌పో

విశాలాంధ్ర/హైదరాబాద్‌: అతిపెద్ద ఫార్మా మెషినరీ షోలలో ఒకటిగా ఉన్న అనలిటికా అనకాన్‌ ఇండియా, ఇండియా ల్యాబ్‌ ఎక్స్‌పో 2022, ఫార్మా ప్రో అండ్‌ ప్యాక్‌ ఎక్స్‌పో 2022 సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు ఫార్మా ప్రో అండ్‌ ప్యాక్‌ ఎక్స్‌పో 2022 జాయింట్‌ ఆర్గనైజర్‌, ఇండియన్‌ ఫార్మా మెషినరీ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హర్షిత్‌ షా చెప్పారు. ఫార్మా ప్రో అండ్‌ ప్యాక్‌ ఎక్స్‌పో పోస్టరు పరిశ్రమ నిపుణులు, ప్రముఖ తయారీదారులు, కొనుగోలుదారుల సంఘం, పాలసీ సలహాదారులు ఫార్మా మెషినరీ విభాగంలోని ఇతర వాటాదారులందరినీ ఈ ఎక్స్‌పో ఒకచోట చేర్చుతుందన్నారు. రెండ్రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరుగుతుందన్నారు. టెక్నాలజీ అండ్‌ ఆటోమేషన్‌ ఫ్యూచర్‌ సినారియోస్‌’ థీమ్‌పై ఏడు నగరాల్లో నిర్వహించిన ప్రీ ఈవెంట్‌ నెట్‌వర్కింగ్‌ రోడ్‌షోల్లో తమకు గొప్ప స్పందన లభించిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img