Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

23న హైదరాబాద్‌లో బిఎన్‌ఐ నెట్‌వర్కింగ్‌ కాన్‌క్లేవ్‌

విశాలాంధ్ర/హైదరాబాద్‌: 75కు పైగా దేశాలలో 2.9 లక్షల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రెఫరల్‌ మార్కెటింగ్‌ సంస్థ బిఎన్‌ఐ (బిజినెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్నేషనల్‌), హైదరాబాద్‌లో అతిపెద్ద బిజినెస్‌ నెట్‌వర్కింగ్‌ కార్యక్రమం బిఎన్‌ఐ నెట్‌వర్కింగ్‌ కాన్‌క్లేవ్‌ 2022 జులై 23 శనివారం నాడు హెచ్‌ఐసిసి నోవాటెల్‌లో గ్రాండ్‌గా జరగనున్నది. 121 (వన్‌ టు వన్‌) ప్రాతిపదికన, ఒకే చోట వ్యాపార, భవిష్యత్‌లో సాధ్యమయ్యే సహకార అవకాశాలను అన్వేషించడంలో ఎంటర్‌ప్రెన్యూర్‌లకు ఈ సదస్సు విస్త్రృత అవకాశాలను అందిస్తుంది. ప్రముఖ మార్కెటింగ్‌ గురు, ప్రహ్లాద్‌ కక్కర్‌ ఒక అవగాహన సదస్సు ద్వారా పోటీ అడ్డంకులను అధిగమించడంలో బ్రాండ్‌ వ్యూహాలను సులభంగా అర్దం అయ్యేలా వివరించనున్నారు. వివిధ రంగాలకు చెందిన 600 మందికి పైగా వ్యాపారవేత్తలు ఈ సదస్సులో భాగమై, తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు, వ్యాపారం, సహకారాల అవకాశాలను చేరుకునేందుకు, అన్వేషించేందుకు ఆసక్తితో వున్నారు. బిఎన్‌ఐ సభ్యులు, బిఎన్‌ఐ సభ్యత్వం లేని ఎంటర్‌ప్రెన్యూర్‌ల మిశ్రమంగా ఈ సదస్సు జరగనున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img