Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

600 కొత్త హోటళ్లు ప్రారంభించనున్న ఓయో

బెంగుళూరు: గ్లోబల్‌ హాస్పిటాలిటీ టెక్నాలజీ మేజర్‌ ఓయో తన ప్లాట్‌ఫారమ్‌లో దక్షిణ భారతదేశంలో హోటళ్లు, హోమ్‌లను (స్టోర్‌ ఫ్రంట్స్‌) గణనీయంగా పెంచుకోవాలని యోచిస్తోంది. వ్యాపారం, లీజర్‌ ప్రయాణ విభాగాలు రెండిరటిలోనూ ఈ ప్రాంతంలో బలమైన బుకింగ్‌ ట్రెండ్‌లతో ప్రోత్సాహాన్ని అందుకుంటూ, ఇక్కడి నుంచి వారానికి దాదాపు 35 హోటల్‌లను అనుసంధానం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం, ఓయో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సుమారుగా 1350 ప్రాపర్టీలను నిర్వహిస్తుండగా, ఈ ప్రాంతంలో తన స్టోర్‌ ఫ్రంట్‌లను 500-700 వరకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాదిలో బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలు భారతదేశంలో ఓయోకు టాప్‌ 10 వ్యాపార మార్కెట్‌లుగా ఉన్నాయి. అదనంగా, కొచ్చి, విశాఖపట్నం, పాండిచ్చేరి దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రముఖ లీజర్‌ మార్కెట్‌లుగా ఉద్భవించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img