బెంగుళూరు: అత్యధికులు ఇష్టపడే ఆన్‌లైన్ బ్రాండ్‌గా అమెజాన్.ఇన్ అని తేలింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి గతంలో కంటే ఉత్సాహంగా, గతంలో ఎప్పుడూ లేని ఆసక్తితో ఉన్నారని నీల్సన్ మీడియా ఇండియా స్వతంత్ర అధ్యయనం పేర్కొంది. అమెజాన్ ఇండియా తరఫున ఈ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది. 81% మంది ఈ విషయంలో బలమైన సెంటిమెంట్, ఉద్దేశం వ్యక్తం చేశారు. 78% మంది ఆన్‌లైన్ షాపింగ్‌ను విశ్వసించారు. గత పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్ల మీద వ్యయం పెంచాలని 2 మందిలో ఒకరు భావిస్తున్నారు. ఈ క్రమంలో, విస్తృతమైన ఎంపికలు, పోటీ ధరలతో పాటు సాటిలేని విలువ, సులభమైన సౌలభ్యం, ఎక్స్ఛేంజ్ సౌకర్యం అందించే ఆన్‌లైన్ షాపింగ్ అనుభవం కోసం వినియోగదారులు ఆశిస్తున్నారు.