Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రైడ్‌ అప్‌ గ్రేడ్స్‌ను ఆరంభించిన అమేజాన్‌, ఊబర్‌

ముంబయి: ప్రైమ్‌ సభ్యులు కోసం ఊబర్‌ పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ను ఆరంభించి అమేజాన్‌, ఊబర్‌లు తమ సంబంధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే ఉన్న అమేజాన్‌-ఊబర్‌ సంబంధంలో భాగంగా, ప్రైమ్‌ సభ్యులు ప్రతి నెల 3 అప్‌ గ్రేడ్స్‌తో ఊబర్‌ గో ధరకి ఊబర్‌ ప్రీమియర్‌ను పొందవచ్చు. ఊబర్‌ ఆటో, మోటో, రెంటల్స్‌, ఇంటర్‌ సిటీ పై ప్రతి నెల 3 ట్రిప్స్‌ కోసం వర్తించే ఐఎన్‌ఆర్‌ 60 వరకు 20% డిస్కౌంట్‌ కూడా వారు అదనంగా పొందగలరు. ఈ రెండు ఆఫర్స్‌ ను ఊబర్‌ పై అమేజాన్‌ పే వాలెట్‌ కు కనక్ట్‌ అయి ట్రిప్స్‌ బుక్కింగ్‌ కోసం ఉపయోగించినప్పుడు పొందవచ్చు. ట్రావెల్‌ రంగం ఆరంభమై, వివిధ ట్రావెల్‌ యూజ్‌ కేసులు దాదాపు పూర్తిగా కోలుకోవడంతో, ప్రైమ్‌ సభ్యులు కోసం సహాయపడటానికి ఆఫర్‌ రూపొందింది. రెండు రోజుల షాపింగ్‌ ఈవెంట్‌-ప్రైమ్‌ డే జులై 23, 24, 2022కి ముందుగా ప్రత్యేకమైన ఆఫర్‌ వర్తిస్తుందని అమేజాన్‌ ఇండియా ప్రైమ్‌ అండ్‌ డెలివరీ ఎక్స్‌ పీరియెన్స్‌ డైరక్టర్‌ అక్షయ్‌ సాహి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img