విశాలాంధ్ర/హైదరాబాద్: అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం బెంగళూరు, భోపాల్ క్యాంపస్‌లలో పీజీ, యూజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రెండేళ్ల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు అయిన ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ డెవలప్‌మెంట్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్), ఎంఏ ఎకనామిక్స్, నాలుగేళ్ల ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులు కోరుతుంది. బీఏ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్, డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ, బీఈడీ కలవు. విద్యార్థులలో నైపుణ్యం, సామాజిక నిబద్ధతను పెంపొందించే కఠినమైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కోర్సులకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక అవుతారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి.