పూణె: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, భారతదేశంలోని ప్రముఖ మరియు అత్యంత వైవిధ్యభరితమైన ఆర్థిక సేవల కంపెనీలలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. తాజాగా ఇది జీతం పొందే అభ్యర్ధులకు వడ్డీ రేట్లు ఏడాదికి 8.45% చొప్పున మొదలయ్యే గృహ రుణాలపై ఒక పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. పండుగ ఆఫర్ కాబోయే కస్టమర్‌లు ఇండస్ట్రీలో లక్షకు రూ. 729నుండి మొదలయ్యే అతి తక్కువ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ నుండి లాభం పొందేలా చేస్తుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. గృహ రుణాలు సెప్టెంబర్ 13, 2023 నుండి నవంబర్ 12, 2023 వరకు విడుదలవుతాయి.