Friday, August 12, 2022
Friday, August 12, 2022

కాయిన్‌స్విచ్‌ ఆధ్వర్యంలో బ్లాక్‌చెయిన్‌ హ్యాకథాన్‌

ముంబయి: భారతదేశంలో అగ్రగామి క్రిప్టో ఇన్వెస్టింగ్‌ యాప్‌ కాయిన్‌స్విచ్‌ కర్ణాటక ప్రభుత్వ ఇనీషియేటివ్‌ స్టార్టప్‌ కర్ణాటక, పార్లమెంటు సభ్యుడు (బెంగళూరు సౌత్‌) తేజస్వి సూర్యతో కలిసి భవిష్యత్‌ నగరాలను గుర్తించి, ప్రోత్సహించే దిశలో బ్లాక్‌చెయిన్‌ హ్యాకథాన్‌ను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. దేశంలోని 1.2 బిలియన్ల జనాభా ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలకు బ్లాక్‌చెయిన్‌ ఆధారిత పరిష్కారాన్ని అందించే ఉద్దేశంతో ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తుండగా, దీనికి సెక్వియా ఇండియా కూడా మద్దతు ఇస్తోంది. స్మార్ట్‌ సిటీ, డిజిటల్‌ గవర్నెన్స్‌, సప్లై చైన్‌ థీమ్‌ల చుట్టూ కేంద్రీకృతమై, భవిష్యత్‌ నగరాలను నిర్మించడం అనేది భారతదేశం కోసం రూపొందించిన, కస్టమైజ్డ్‌ వెబ్‌3 ఇన్నోవేషన్‌ సైకిల్‌ను ప్రారంభించేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. స్మార్ట్‌ మొబిలిటీ, ఎనర్జీ క్రెడిట్స్‌, ట్రేడిరగ్‌, వ్యర్థాల నిర్వహణ వికేంద్రీకృత, సురక్షితమైన డిజిటల్‌ను గుర్తించడం, సర్టిఫికేట్ల నిర్వహణ, సమర్థవంతమైన మరియు పారదర్శకమైన వ్యాక్సిన్‌ పంపిణీ, వ్యవసాయ సరఫరాలు మరియు సప్లయ్‌ చైన్‌ నిర్వహణపై దృష్టి సారించి బ్లాక్‌చెయిన్‌-ఆధారిత భారతదేశాన్ని విజువలైజ్‌ చేయాలని పోటీలో పాల్గొనే వారికి హ్యాకథాన్‌లో సవాలు విసురుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img