న్యూఢల్లీి: కెనరా హెచ్‌ఎస్‌బిసి లైఫ్ ఇన్సూరెన్స్ 2022-23కి సంబంధించి తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది, వినూత్నమైన పధకాలు విడుదల చేయటం మరియు కొత్త కస్టమర్ సర్వీసింగ్ మార్గాల ద్వారా చక్కటి ఆర్థిక పనితీరును కనబరిచింది. కంపెనీ వరుసగా 11వ సంవత్సరం గత ఆర్థిక సంవత్సరంలో లాభాన్ని నమోదు చేసింది, 2022-23 కోసం పన్నుకు ముందు లాభం రూ. 100 కోట్లు గా వుంది. వ్యక్తిగత కొత్త వెయిటెడ్ ప్రీమియం ఆదాయంలో 21% వృద్ధి నమోదు అయ్యి రూ. 1,658 కోట్లుగా 2022-23లో ఉంటే మునుపటి సంవత్సరం అది రూ. 1,375 కోట్లుగా వుంది. కంపెనీ గ్రాస్ రిటెన్ ప్రీమియం 22% పెరిగి రూ. 7,197 కోట్లుగా 22-23లో చేరింది. అది 21-22లో రూ. 5,890 కోట్లు.