న్యూదిల్లీ: 2023 సంవత్సరం చివరి నాటికి, భారతదేశంలో తమ మూడవ అత్యాధునిక తయారీ కేంద్రం వద్ద కార్యకలాపాలను డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించనుంది. దాదాపు 75 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఈ కొత్త ఫ్యాక్టరీ ఉంది. ఆవిష్కరణ, శ్రేష్ఠత పట్ల డైకిన్ అంకితభావానికి నిదర్శనంగా ఇది నిలుస్తుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా భారతదేశంలో తయారు చేయబడిన అత్యాధునిక ఎయిర్ కండిషనింగ్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఇది వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. ఎయిర్ కండిషనింగ్ విభాగంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) ప్రోగ్రామ్‌లో డైకిన్ ప్రధాన పెట్టుబడిదారు, ఎయిర్ కండిషనర్ల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వంచే అమలు చేయబడుతున్న పథకాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) ప్రోగ్రామ్ ఒకటి.