Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఐక్యూ నియో 7 ప్రో క్యాంపెయిన్‌లో దుల్కర్‌ సల్మాన్‌

న్యూఢల్లీి : హై పెర్ఫార్మెన్స్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ ఇటీవల విడుదల చేసిన నియో 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కోసం సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘స్లీప్‌ లెస్‌ స్టార్‌’ పేరుతో తన తాజా డిజిటల్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. దుల్కర్‌ సల్మాన్‌ శాంతి, ప్రశాంతత కోసం చూస్తున్నప్పటికీ తన పక్కనే ఉంచిన ఐక్యూ నియో 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వైపు ఆకర్షితుడయ్యే ప్రత్యేకమైన కథాంశంతో ఈ ప్రచారం సాగుతుంది. ఐక్యూ, ష్బాంగ్‌ సంస్థలు రూపొందించిన ఈ క్యాంపెయిన్‌ దుల్కర్‌ తన ప్రలోభాలకు లొంగి ఫోన్‌ను ఎలా ఉపయోగించడం మొదలుపెడతాడో, దాని హైటెక్‌ ఫీచర్లకు పూర్తిగా ఆకర్షితుడవుతాడో తెలియజేస్తుంది. అతను ‘టెక్‌ థెరపీ’ అని పిలువబడే చికిత్స కొత్త రూపాన్ని కనుగొంటాడు. ఈ వినూత్న ప్రచారం ఇప్పటికే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img