Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మై బిల్‌ బుక్‌ యాప్‌తో ఈ-ఇన్వాయిస్‌లు

ముంబయి: దేశంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న మధ్య తరహా వ్యాపారులకు అకౌంటింగ్‌ పరిష్కారాలు చాలా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో ముందుండి, ఎప్పటికప్పుడు పరిష్కారాలను అందిస్తున్న సంస్థ ఫ్లోబిజ్‌. ఇది ప్రముఖ అకౌంటింగ్‌ సంస్థ. ఇప్పటికే చాలా వ్యాపారాలకు బిజినెస్‌ అకౌంటింగ్‌ సొల్యూషన్స్‌ను అందించింది. ఇప్పుడు మరో అద్భుతమైన ప్రొడక్ట్‌తో ముందుకు వచ్చింది. ప్రముఖ నియో బ్యాంక్‌ ఫ్లోబిజ్‌.. తన ప్రధాన జీఎస్టీ ఇన్వాయిస్‌, అకౌంటింగ్‌ కోసం మై బిల్‌ బుక్‌ యాప్‌ని ఉపయోగిస్తుంది. అయితే ఇప్పుడు మై బిల్‌ బుక్‌ అప్‌నా పేరుతో కొత్త ఈ-ఇన్వాయిస్‌ సర్వీసుని ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్తగా ప్రారంభమైన ఈ సర్వీస్‌.. మైబిల్‌ బుక్‌ యాప్‌ సామర్థ్యాన్ని, అధునాతన బిల్లింగ్‌ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జీఎస్‌టీ ఇన్వాయిస్లను రూపొందిస్తుంది. అంతేకాకుండా ఉపయోగకరమైన ట్యాక్స్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు పన్ను ప్రణాళికను మెరుగుపరుస్తుంది. ఈ మై బిల్‌ బుక్‌ యాప్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌తో పాటు ఆఫ్‌లైన్‌ డెస్క్‌టాప్‌, వెబ్‌అప్లికేషన్లో అందుబాటులో ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img