వరంగల్ : విఈ కమర్షియల్ వెహికల్స్ వ్యాపార విభాగం ఐషర్ ట్రక్స్ అండ్ బస్సెస్ తమ నూతన 3ఎస్ (సర్వీస్, స్పేర్స్ మరియు సేల్స్) డీలర్‌షిప్, వీవీసీ మోటార్స్‌ను ప్రారంభించింది. వరంగల్ నగరం నడిబొడ్డున 1-ఎకరంలో ఈ సదుపాయం వుంది. ఇక్కడే ప్రత్యేకంగా 2000 చదరపు అడుగుల ప్రదర్శన ప్రాంతం ఏర్పాటు చేయబడిరది. ఇక్కడ పూర్తిగా విడిభాగాలకు సంబంధించిన సమగ్ర జాబితా ప్రదర్శించనున్నారు. వీటితో పాటుగా ఈ డీలర్ షిప్ వద్ద సామర్థ్యం, సేవా ఉత్పాదకతను పెంచే బహుళ- సర్వీస్ బేలు కూడా ఉన్నాయి. ఈ డీలర్‌షిప్ 24I7 మద్దతు మరియు ఫ్యాక్టరీ-శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో వ్యవసాయం, పత్తి, వస్త్ర మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలలో పనిచేస్తున్న స్థానిక మరియు రవాణా రంగంలోని ఐషర్ కస్టమర్‌లకు తగిన సహాయాన్ని అందించడానికి సరైన స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన కనెక్టివిటీ కలిగిన వరంగల్, అనేక విద్యా సంస్థలకు నిలయంగా ఉండటంతో పాటుగా రాబోయే ఐటీ పరిశ్రమ కేంద్రంగా కూడా నిలువనుంది.