Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ఫ్యామిలీ నెం.1 ప్రత్యేక షో జీ తెలుగులో!

కరీంనగర్‌ : తెలుగు ప్రేక్షకులను అలరించేలా సరికొత్త కాన్సెప్ట్‌తో రియాలిటీ షోలను అందిస్తున్న జీ తెలుగు ఛానెల్‌ ఆదివారం మరింత వినోదాన్ని అందించడానికి సూపర్‌ క్వీన్‌, లేడీస్‌ అండ్‌ జెంటిల్మన్‌ వంటి షోలతో అలరించిన జీ తెలుగు ఈ వారం నుంచి మరో సరికొత్త షోతో మీ ముందుకు రానుందని ఆ ఛానెల్‌ ప్రతినిధి చెప్పారు. తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ కుటుంబాలతో కలిసి సందడి చేయనున్న షో ఫ్యామిలీ నెం.1 అన్నారు. యాంకర్‌ రవి, రోహిణి హోస్ట్‌ చేయనున్న ఈ షోలో ఎనిమిది సెలబ్రిటీ కుటుంబాలు పాల్గొననున్నాయన్నారు. ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించడానికి సిద్దమైన ఫ్యామిలీ నెం.1 ఆగస్టు 6న ప్రారంభమై ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతుందన్నారు. ఎనిమిది సెలబ్రిటీ ఫ్యామిలీస్‌ కలిసి కొన్ని ఛాలెంజింగ్‌ గేమ్స్‌లో తలపడనున్నాయని, అన్ని కుటుంబాలు ఆసక్తికరమైన పేర్లతో ఈ షోలో పోటీదారులుగా అలరించేందుకు సిద్దమయ్యాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img