Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

గోద్రెజ్‌ అగ్రోవెట్‌ ‘పైనా’తో రైతులకు లాభాలు

ముంబయి: గోద్రెజ్‌ అగ్రోవెట్‌ లిమిటెడ్‌ (జీఏవీఎల్‌), క్రాప్‌ ప్రొటెక్షన్‌ బిజినెస్‌ తాజాగా కంపెనీ ‘పైనా’ బ్రాండ్‌ ఉత్పత్తులు పత్తి రైతులకు ఎకరాకు అయ్యే సాగు ఖర్చును గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొంది. పర్యావరణ అనుకూల పత్తి ఉత్పత్తి కోసం ఒక అంబ్రెల్లా బ్రాండ్‌ పైనాలో పత్తి కలుపు నిర్వహణ ఉత్పత్తులు హిట్‌వీద్‌, హిట్‌వీద్‌ మ్యాక్స్‌, మ్యాక్స్‌కాట్‌లు భాగంగా వున్నాయి. ఈరోజు రైతులు పంటలకు సంబంధించి అత్యంత కీలకమైన సీజన్‌లో తీవ్రమైన కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు భారీ వర్షాల వల్ల కూలీలతో కలుపు తీయించటం లేదా వ్యవసాయ యంత్రాల వినియోగం కష్టతరమవుతున్నాయి, ఈ సవాళ్లను అధిగమించడానికి మరియు ఉత్పాదకతను పెంచడానికి ఈ వినూత్న పరిష్కారాలు రూపొందించినట్లు జీఏవీఎల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ బిజినెస్‌, సీఈఓ రాజవేలు ఎన్‌ కె అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img