గురుగ్రామ్: భారత తొలి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్, అత్యధిక ఎగుమతిదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) 2023 ఆగస్టు నెలలో 71,435 యూనిట్లు అమ్మకాలను చేపట్టింది. ఇందులో దేశీయ విక్రయాలు 53,830, ఎగుమతులు 17,605 యూనిట్లు వున్నాయి. హెచ్‌ఎంఐఎల్ సీఓఓ తరుణ్‌గార్గ్ మాట్లాడుతూ, తమ ఉత్పత్తులకు దేశవిదేశీల్లో గిరాకీ వుందనడానికి ఈ అమ్మకాలే నిదర్శనమని పేర్కొన్నారు. కేరళలో ఓనమ్ సేల్స్ పెరగడం దేశవ్యాప్తంగా పండుగ ఆదరణ తమ వెహికల్స్ వుందని రుజువైందన్నారు. దేశీయ అమ్మకాలు 60% పెరిగాయన్నారు. ఇవిగాక ఇప్పటికే మరో 65000 యూనిట్లు బుకింగ్స్ సిద్ధంగా వున్నాయన్నారు.