Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఎంఎస్‌ఎంఈలకు గోద్రెజ్‌ క్యాపిటల్‌ రుణాలు

హైదరాబాద్‌: గోద్రెజ్‌ గ్రూప్‌ ఆర్థిక సేవల విభాగం అయిన గోద్రెజ్‌ క్యాపిటల్‌, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు) కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అన్‌సెక్యూర్డ్‌ బిజినెస్‌ లోన్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వ్యాపారాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తిస్తూ, గోద్రెజ్‌ క్యాపిటల్‌ వినూత్నమైన, సౌకర్యవంతమైన రీపేమెంట్‌ అవకాశాలను అందించడం ద్వారా నగదు ప్రవాహ నిర్వహణ వారి ప్రత్యేక అవసరాలను తీర్చే ఫైనాన్సింగ్‌ ఎంపికలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి డిజిటలైజ్డ్‌ ప్రాసెస్‌, వేగవంతంగా మంజూరు చేయటం, రుణాలను అందించటం, 60 నెలల వరకు చెల్లించే అవకాశం, సకాలంలో తిరిగి చెల్లింపులపై పరిశ్రమలో మొట్ట మొదటి రివార్డ్‌ ప్రోగ్రామ్‌తో సహా అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img