Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జర్నలిస్టులకు గూగుల్‌ న్యూస్‌ శిక్షణ

విశాలాంధ్ర/హైదరాబాద్‌ : ది గూగుల్‌ న్యూస్‌ ఇనీషియేటివ్‌ ఇండియా ట్రైనింగ్‌ నెట్వర్క్‌.. డేటాలీడ్స్‌, ఇన్‌ ఓల్డ్‌ న్యూస్‌ల సహకారంతో హైదరాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో ‘పోల్‌చెక్‌ ఎలక్షన్‌ అకాడమీ 2023’ మొదటి సెషన్‌ను నిర్వహించింది. అధునాతన ఎన్నికల రిపోర్టింగ్‌ నైపుణ్యాలతో జర్నలిస్టులను సన్నద్ధం చేసి శిక్షణాకార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం వంటి ఐదు రాష్ట్రాలలో పోల్‌చెక్‌ ఎలక్షన్‌ అకాడమీ 2023 శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. త్వరలో భారతదేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలను కవర్‌ చేసే జర్నలిస్టులు, న్యూస్‌రూమ్‌లకు అవసరమైన సాధనాలు, నైపుణ్యాలను సేకరించడానికి, ధృవీకరించడానికి, సరికొత్త కథనాలను అందించడానికి తోడ్పాటును ఇస్తుంది. అనుభవజ్ఞులైన జర్నలిస్టుల నేతృత్వంలో పలు విషయాలపై ఈ సెషన్‌ లో ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌, వీడియో స్టోరీటెల్లింగ్‌, డిజిటల్‌ సేఫ్టీ, న్యూస్‌ ఫర్‌ న్యూస్‌, మీడియా లిటరసీ, డేటా జర్నలిజం వంటి అంశాలపై చర్చించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img