Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఘనంగా ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’ వేడుకలు

హైదరాబాద్‌: భారతదేశంలో అతిపెద్ద ప్రాంతీయ ఈవెంట్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ), దాని కానిస్ట్యూన్ట్‌ అసోసియేషన్‌ తెలంగాణ ఈవెంట్‌ ఫెసిలిటేటర్స్‌ అసోసియేషన్‌ (టీఈఎఫ్‌ఏ) ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ బిజినెస్‌ హెడ్‌ టీజీ శ్రీకాంత్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌, తెలంగాణ టూరిజం సహకారం అందించాయి. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్లు ఔత్సాహికుల కోసం మాస్టర్‌ క్లాసులు నిర్వహించారు. ఈ మాస్టర్‌ క్లాసుల్లో తమ అనుభవాలను పంచుకున్నారు. జర్నీ ఆఫ్‌ ఫొటోగ్రఫీపై రవీందర్‌ రెడ్డి తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ ఎగ్జిబిషన్లో 50 మంది ఫొటోగ్రాఫర్లు వివిధ థీమ్లతో ఫొటోలు ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img