ముంబయి: భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండ్-టు-ఎండ్ డిజిటల్ కన్స్యూమర్ లోన్‌లు- ‘కార్డ్‌లెస్ ఈజీఈఎంఐ’లను అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రకటించింది. అందరికీ రుణాన్ని అందించేందుకు 100% డిజిటల్-ఫస్ట్ పే లేటర్ ప్లాట్‌ఫారమ్ షాప్‌సేతో బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023లో ప్రారంభించిన ఈ వినూత్న ఆఫర్ పూర్తిగా డిజిటల్ మరియు వేగవంతమైన రుణాల అనుభవం వైపు గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.