బెంగళూరు: పుణెలో విశిష్ట జీవవైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో సదరన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ, సొసైటీ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ (ఎస్‌ఈబీసీ) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తిరంగా టన్నెల్ నిర్మాణానికి ప్రముఖ వెల్‌నెస్ బ్రాండ్ హిమాలయ వెల్‌నెస్ కంపెనీ సహకారాన్ని ఇస్తోంది. పుణె కంటోన్మెంట్ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు దేశాన్ని, సహజ వనరులను పరిరక్షించడంలో అంకితభావంతో గుర్తింపు కలిగిన భారత సైన్యం చొరవ తీసుకుంది. జీవవైవిధ్యం కలిగిన పశ్చిమ కనుమలకు సమీపంలోని ఈ ప్రాంతం అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటుండగా, వీటిలో చెట్ల విస్తీర్ణం తగ్గిపోవడం, పెరుగుతున్న కాలుష్యం తదితరాలు ఉన్నాయి. భారతీయ సైన్యంలో దక్షిణాది కమాండ్, హిమాలయ వెల్‌నెస్ కంపెనీ సహకారంతో ప్రకృతి సంపదను రక్షించుందకు, పర్యావరణ బాధ్యతను ప్రోత్సహించేందుకు తిరంగా టన్నెల్ ప్రాజెక్ట్‌ను ఒక చారిత్రాత్మక ప్రయత్నంగా భావిస్తోంది. 13 మీటర్ల వెడల్పు, 4.5 మీటర్ల ఎత్తు కలిగిన తిరంగా టన్నెల్ అనేది మన అద్భుతమైన స్మారక చిహ్నం.