విశాలాంధ్ర/ఖమ్మం: ఖమ్మం నగరంలో ఇటీవల బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) శాటిలైట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా బీబీజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ఈ సెంటర్ ద్వారా సంభావ్య రియల్ ఎస్టేట్ క్లయింట్‌లతో నిమగ్నం కావడం, విచారణలను పరిష్కరించడం, విలువైన కనెక్షన్‌లను పెంపొందించడం కోసం ఒక కీలకమైన హబ్‌ను సృష్టించడం ఈ కేంద్రం లక్ష్యమన్నారు. ఏఎస్‌ఎన్ కన్వెన్షన్ హాల్‌లో ‘బీబీజీ భవ్యపథం’ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ ఈవెంట్ ఖమ్మం వ్యాపార క్యాలెండర్‌లో ప్రాముఖ్యతకు నిదర్శనంగా ఉందన్నారు. ఇది కనెక్షన్‌లను పెంపొందించడానికి, ఖాతాదారులకు సేవ చేయడానికి ఉపయోగపడనుందని పేర్కొన్నారు. ఈవెంట్‌కు మేనేజ్‌మెంట్ కౌన్సిల్, సీనియర్ లీడర్‌షిప్ టీమ్, లీడర్స్ క్లబ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, స్టాండిరగ్ కమిటీతో సహా బీబీజీ సభ్యులు హాజరయ్యారు.