Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఫోన్‌పేలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌పేమెంట్‌ ఫీచర్‌

ముంబయి: తన యాప్‌లో ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పేమెంట్‌’ ఫీచర్‌ను ఆవిష్కరించినట్టు ఫోన్‌పే ప్రకటించింది. ఈ ఫీచర్‌ ఇటు వ్యక్తిగతంగా, అటు వ్యాపార పరంగా ట్యాక్స్‌ చెల్లించే వారికి ఫోన్‌పే యాప్‌లోనే నేరుగా సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను పే చేసేందుకు అనుమతిస్తుంది. ఇది ట్యాక్స్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ కావాల్సిన ఆవశ్యకతను తొలగించి, ట్యాక్స్‌ చెల్లించే వారికి నిరంతరాయమైన, సమర్థవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్‌కు వీలు కల్పిచడం కోసం అగ్రగామి డిజిటల్‌ బీ2బీ పేమెంట్స్‌, సేవా సంస్థ పేమేట్‌తో ఫోన్‌పే జట్టు కట్టింది. వినియోగదారులు తమ క్రెడిట్‌ కార్డ్‌ లేదా యూపీఐని ఉపయోగించి, తమ ట్యాక్స్‌లను పే చేయాలని ఎంచుకోవచ్చు. క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్లతో, వినియోగదారులు 45 రోజుల వడ్డీ లేని కాలాన్ని కూడా పొందవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img