హైదరాబాద్: కరూర్ వైశ్యా బ్యాంక్ తమిళనాడులో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు, తెలంగాణలో ఒకటి, కర్నాటకలో ఒకటి చొప్పున మొత్తం 10 కొత్త బ్రాంచీలను ప్రారంభించింది. దీంతో బ్యాంక్ తాలూకు బ్రాంచీల నెట్వర్క్ 822కి పెరిగిందని కేవీబీ మేనేజింగ్ డైరెక్టర్ బి.రమేష్ బాబు తెలిపారు. తెలంగాణకు సంబంధించి ఖమ్మంలో ఒక బ్రాంచ్ ప్రారంభించామన్నారు. తమిళనాడులోని కొయంబత్తూర్, ఆయప్పాకం, తిరుచ్చి, ఆలంగుడి, హోసూరు, ఉత్తుకులిలో ప్రారంభించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముమ్ముడివరం, పలమనేరులో ఏర్పాటు చేశామన్నారు.