విశాలాంధ్ర/హైదరాబాద్: రెండు బ్లాక్‌బస్టర్ లాంచ్ ఎపిసోడ్స్ ద్వారా 10 కంటెస్టెంట్ జోడీలను వీక్షకులకు పరిచయం చేసిన జీ తెలుగు ఛానల్ ఇప్పుడు కాంపిటీషన్ ఫేస్‌ను మునుపెన్నడూలేని విధంగా ప్రారంభించనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంపిటీషన్ ఫేస్‌ను ‘ ఫ్లాగ్ ఆఫ్ ‘ చేయబోతుండగా , తన కూతురు సితారతో కలిసి మొదటిసారి ఒక రియాలిటీ షోలో కనిపించనున్నారు. కంటెస్టెంట్స్ మైమరపించే ప్రదర్శనలతోపాటు మహేష్ సితారలు యాంకర్స్ జడ్జెస్‌తో సెప్టెంబర్ 4న (ఆదివారం) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ఇండియా డాన్స్ ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. మహేష్‌బాబు తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించబోతుండగా, సితార వాళ్ళ నాన్నతో చేసే అల్లరి ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలవనుంది.