Monday, September 25, 2023
Monday, September 25, 2023

26న శామ్‌సంగ్‌ తదుపరి తరం ఫోల్డబుల్‌ పరికరాలు విడుదల

గురుగ్రామ్‌: శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ జూలై 26న కొరియాలోని సియోల్‌లో మొదటి అన్‌ప్యాక్డ్‌ను నిర్వహిస్తోంది. ఈ దక్షిణ కొరియా కంపెనీ సరికొత్త గెలాక్సీని, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, జీవితాలలో మార్పు తీసుకు వచ్చేందుకు రూపొందించిన ఇతర తాజా సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శించనుంది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ మీరు ఫ్లిప్‌ సైడ్‌లో చేరాలని కోరుకునేలా చేస్తుంది. అదే సమయంలో, భారతదేశంలోని వినియోగదారులు శామ్‌సంగ్‌.కామ్‌, అమెజాన్‌.ఇన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2000 చెల్లించడం ద్వారా లేదా దేశవ్యాప్తంగా శామ్‌సంగ్‌ ప్రత్యేకమైన స్టోర్‌లు, ప్రముఖ రిటైల్‌ అవుట్‌లెట్‌లను సందర్శించడం ద్వారా శామ్‌సంగ్‌ తదుపరి తరపు ఫోల్డబుల్‌ పరికరాలను ప్రీ-రిజర్వ్‌ చేసుకోవచ్చు. జూలై 26, 2023న ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న శామ్‌సంగ్‌ తదుపరి తరం ఫోల్డబుల్‌ పరికరాల కొనుగోలుపై ప్రీ-రిజర్వ్‌ చేసుకున్న వినియోగదారులు రూ.5000 విలువైన ప్రయోజనాలను పొందుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img