బెంగళూరు: తన అనుబంధ సంస్థ ఫోన్‌పే వెల్త్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలో ఏర్పాటు చేసిన షేర్(డాట్)మార్కెట్ ద్వారా స్టాక్ బ్రోకింగ్ రంగంలోకి ప్రవేశించినట్టు ఫోన్‌పే ప్రకటించింది. మార్కెటింగ్ మేధస్సు, పరిణామాత్మక పరిశోధన ఆధారితంగా పనిచేసే వెల్త్ బాస్కెట్లను, భారీ స్థాయి ప్రతిస్పందన సామర్థ్యం కలిగిన టెక్నాలజీ ప్లాట్ ఫారం, పెట్టుబడిదారులు, ట్రేడర్లు లాంటి వారికి గొప్ప కస్టమర్ అనుభవాన్ని అందించడం ద్వారా డిస్కౌంట్ బ్రోకింగ్ ఫీచర్‌ను షేర్(డాట్)మార్కెట్ తెర ముందుకు తీసుకువచ్చింది. షేర్(డాట్)మార్కెట్ మొబైల్ యాప్, నిబద్ధత కలిగిన వెబ్ ప్లాట్ ఫారంగా అందుబాటులో ఉంది. ఇది రీటైల్ పెట్టుబడిదారులను స్టాకుల కొనుగోలు, ఇంట్రా డే ట్రేడిరగ్ చేయడం, క్యూరేటడ్ వెల్త్ బాస్కెట్లను, మ్యూచువల్ ఫండ్స్ ను కొనడానికి వీలు కల్పిస్తుంది.