Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

పయనీర్‌ సీడ్స్‌ 50 ఏళ్ల వేడుకలు చేస్తున్న కార్టెవా

ముంబయి: గ్లోబల్‌ ప్యూర్‌-ప్లే అగ్రికల్చర్‌ కంపెనీ, కార్టెవా అగ్రిసైన్స్‌ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భారతదేశంలో పయనీర్‌ సీడ్స్‌ 50 సంవత్సరాల వారసత్వాన్ని వేడుక చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా, దశాబ్దాలుగా పయనీర్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న రైతులతో పాటు వ్యవసాయంలో సానుకూల సహకారం అందిస్తున్న మహిళా రైతులను కూడా కార్టెవా అభినందించింది. వ్యవసాయాన్ని విధానాలను మార్చడంలో, దిగుబడి, ఉత్పాదకతను పెంపొందించడానికి తోటి రైతులతో విజ్ఞానం, ఉత్తమ పద్ధతుల ఆవిష్కరణలో నిరంతర కృషి చేసిన రైతు రాయబారులుగా-కార్టెవా ప్రవక్తాస్‌ గుర్తింపు పొందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img