ముంబయి: భారతదేశపు అతిపెద్ద లెర్నింగ్ ఫ్లాట్ ఫామ్‌గా గుర్తింపు తెచ్చుకుంది అన్ అకాడమీ. ఎంతోమంది విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా విద్యాబోధన చేసి వారి కలలను సాకారం చేసుకునే విధంగా కృషి చేసింది. అంతేకాకుండా అన్ అకాడమీ జాతీయ స్కాలర్ షిప్ అడ్మిషన్ టెస్ట్ (అన్‌శాట్) ద్వారా ఐఐటీ, జేఈఈ, నీట్ యూజీ అభ్యాసకులకు ఎప్పటికప్పుడు సహాయసహకారాలను అందిస్తోంది. ఇప్పుడు ఈ టెస్ట్ ను మూడోసారి నిర్వహిస్తోంది అన్ అకాడమీ. ఇప్పుడు ఈ టెస్ట్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్… నీట్, జేఈఈ పరీక్షలను సాధించాలనుకునే విద్యార్థులకు అద్భుతమైన అవకాశం. దీనిద్వారా విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా పెంచుకుని, నీట్ మరియు జేఈఈ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేందుకు అవకాశం లభిస్తుంది.