Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

12 రాష్ట్రాల్లో రూమ్‌ టు రీడ్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘రీడ్‌-ఎ-థాన్‌’

ముంబయి: ఇండియా గెట్స్‌ రీడిరగ్‌ అనే ప్రముఖ పఠనా ప్రచార కార్యక్రమంలో భాగంగా రూమ్‌ టు రీడ్‌ ఇండియా`‘‘రీడ్‌-ఎ-థాన్‌’’ కార్యక్రమాన్ని నిర్వహించింది. పిల్లలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీలు, ప్రభుత్వం, దాతలు, యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్మెంట్‌ (యుఎస్‌ఎఐడి), ఇతర మద్దతుదారులు సహా అన్ని భాగస్వాముల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు చేరుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ ఏడాది రీడ్‌-ఎ-థాన్‌ రికార్డు నెలకొల్పే దిశగా రూమ్‌ టు రీడ్‌ ఇండియా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయత్నంలో రికార్డు సంఖ్యలో ప్రజలు వ్యక్తిగతంగా పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంస్థ క్రియాశీలంగా ఉన్న 12 రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో పఠనాసక్తిగలవారు చదవడం కోసం ఏర్పాట్లు చేశారు. ఈ రీడ్‌-ఎ-థాన్‌, స్కూలు ఆవరణలు, కమ్యూనిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, దాతల కార్యాలయాలు మొదలైన ప్రదేశాల్లో భాగస్వాములందరూ ఒకచోట చేరడానికి దోహదపడుతుంది, పిల్లల పఠనం, అభ్యసన దిశగా వారి మద్దతును తెలియజేస్తుందని రూమ్‌ టు రీడ్‌ డిప్యూటీ కంట్రీ డైరెక్టర్‌ పూర్ణిమ గార్గ్‌ అన్నారు. పఠనాసక్తిని ప్రోత్సహించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి సాధ్యమైనంత ఎక్కువ మందిని సమీకరించడమే ఈ రీడ్‌-ఎ-థాన్‌ ద్వారా రూమ్‌ టు రీడ్‌ ఇండియా లక్ష్యం. దీనికి అదనంగా, ఒకే సమయంలో బహుళ సాహిత్యాలను చదవడంలో పాల్గొనేవారి సంఖ్యతో ఈ కార్యక్రమం అధికారిక రికార్డును నెలకొల్పుతుందని భావిస్తున్నారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తమ పుస్తకాల్లో ఈ రికార్డ్‌ నెలకొల్పే కార్యక్రమాన్ని పొందుపరుస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img