న్యూఢల్లీ : అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ రియల్‌మీ తాజాగా నాలుగు విప్లవాత్మక ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాని ‘హీరో’ నంబర్ సిరీస్, ఏఐఓటి సెగ్మెంట్-రియల్‌మీ 11 5జీ, రియల్‌మీ 11ఎక్స్ 5జీ, రియల్‌మీ బడ్స్. ఎయిర్ 5, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో. ఈ సంచలనాత్మక పరికరాలు అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన డిజైన్ల కలయికను సూచిస్తాయి. మునుపెన్నడూ లేని విధంగా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడ్డాయని రియల్‌మీ ప్రతినిధి తెలిపారు. రియల్‌మీతో ఏఐఎంఆర్‌ఏ భాగస్వామ్యంతో ఈ గొప్ప కలయిక వచ్చిందన్నారు. ఏఐఎంఆర్‌ఏ (ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్) వ్యవస్థాపకుడు, చైర్మన్ కైలాష్ లఖ్యాని మాట్లాడుతూ, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని, వాటిని తీర్చే సాంకేతిక మార్గదర్శకుడైన రియల్‌మీతో భాగస్వామ్యం కావడం ఏఐఎంఆర్‌ఏకి నిజంగా గౌరవమని అన్నారు.