Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

శామ్‌సంగ్‌ వాలెట్‌లో పలు సౌకర్యాలు

గురుగ్రామ్‌: గాలక్సీ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్స్‌ శామ్‌సంగ్‌ వాలెట్‌లో భాగంగా ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ వంటి తమ అన్ని అవసరమైన డిజిటల్‌ ఐడీలను ఇప్పుడు యాక్సెస్‌ చేయవచ్చని ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శామ్‌సంగ్‌ ప్రకటించింది. ‘పవిరంగ్‌ డిజిటల్‌ ఇండియా’ కలతో భారతదేశపు శక్తివంతమైన భాగస్వామిగా ఉండటానికి శామ్‌సంగ్‌ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. గాలక్సీ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్స్‌ తమ కో-విన్‌ వేక్సినేషన్‌ సర్టిఫికెట్స్‌ను కూడా తమ ఫోన్‌లో సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా భద్రపరచవచ్చు. ఇంకా, శామ్‌సంగ్‌ సరికొత్త శామ్‌సంగ్‌ వాలెట్‌కు పలు కొత్త ప్రయాణ, సంచార ఫీచర్స్‌ను పరిచయం చేసింది. ఇవి గాలక్సీ స్మార్ట్‌ఫోన్స్‌పై శామ్‌సంగ్‌ పే, శామ్‌సంగ్‌ పాస్‌లో ఇప్పటికే ఉన్న ఫీచర్స్‌తో విలీనమవుతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img