Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌కు 19 వసంతాలు

ముంబయి: ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ 19 వసంతాలను పూర్తి చేసుకుంది. 2004, సెప్టెంబర్‌ 17న ప్రారంభమైన ఈ స్కీమ్‌ మొదలైనప్పటి నుండి చూస్తే 18.91% వార్షిక చక్రీయ వృద్ధి రేటు (సీఏజీఆర్‌)ను అందించింది, అంటే, స్కీమ్‌ యొక్క ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో రూ. 1 లక్ష పెట్టుబడిగా పెడితే, అది దాదాపు రూ. 26.88 లక్షలకు పెరిగి ఉండేదన్న మాట. 10 ఏళ్ల పాటు ఈ స్కీమ్‌లో సిప్‌ (ఎస్‌ఐపీ) ద్వారా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే, ఇన్వెస్టర్లకు 15.66% సీఏజీఆర్‌ను అందించి ఉండేది, ఇది దాని బెంచ్‌మార్క్‌ 15.3% కంటే ఎక్కువ. ఒక ఇన్వెస్టర్‌ ప్రారంభం నుండి ప్రతి నెలా రూ. 10,000 చొప్పున పెట్టుబడి పెడితే, మొత్తం పెట్టుబడి రూ. 12 లక్షలు కాస్తా రూ.26.93 లక్షలకు పెరిగి ఉండేది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img