ముంబయి: స్పోర్ట్స్ రంగంలో స్పార్క్స్ బ్రాండ్ నాణ్యమైన ఉత్పత్తులకు చిరునామాగా వుంది. ఈ బ్రాండ్ రిలాక్స్ కంపెనీ ద్వారా మార్కెట్‌లోకి వస్తుంది. ఎన్నో ఉత్పత్తుల ద్వారా ఆకట్టుకున్న స్పార్క్స్ బ్రాండ్… ఇప్పుడు ఈ శీతాకాలం 23 కలెక్షన్‌ను విడుదల చేసింది. సరికొత్త ఫ్యాషన్‌తో ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అయ్యే నేటి యువత కోసం కంఫర్ట్, స్టైల్‌ని పునర్నిర్వచిస్తూ ఈ శీతాకాల 23’ కలెక్షన్‌ను ప్రారంభించింది. స్పార్క్స్ తన అథ్లెయిజర్, లైఫ్‌స్టైల్ కలెక్షన్ నుండి 100కి పైగా షూ డిజైన్‌ల అద్భుతమైన శ్రేణిని కలిగి ఉన్న ‘స్పార్క్స్ ఇట్స్ ఇన్ మీ’ క్యాంపెయిన్ ద్వారా ఈ కొత్త కలెక్షన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త కలెక్షన్ పురుషులు, మహిళలు, పిల్లలకు అందరికి అందుబాటులో ఉంటాయి. వీటి ధర రూ.999 నుంచి రూ.2499 వరకు ఉంటాయి. 400 కంటే ఎక్కువ రిలాక్సో బ్రాండ్ అవుట్‌లెట్‌లు, ప్రముఖ పాదరక్షల దుకాణాలు, వారి అధికారిక వెబ్‌సైట్‌లో కూడా లేటెస్ట్ స్పార్క్స్ కలెక్షన్‌ని చూడవచ్చునని రిలాక్సో ఫుట్ వేర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ దువా తెలిపారు.