ముంబయి: తమ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) డీలర్లకు సమగ్రమైన సప్లయ్ చైన్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అందించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తిదారు టాటా మోటార్స్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియా`స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుతం టాటా మోటార్స్ ప్యాసింజర్ కమర్షియల్ వెహికల్ వ్యాపారాల్లో ఈ సంస్థకు చెందిన ఐసీఈ డీలర్‌షిప్స్‌కు ఇన్వెంటరీ ఫండిరగ్ లిమిట్స్‌ను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అందిస్తున్నది. టాటా మోటార్స్ అనుబంధ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎంఎల్) ద్వారా ఈవీలకు ఆర్థిక సహకారం అందించేలా ఈ బ్యాంకుతో టాటా మోటార్స్ ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేయనున్నది.