విశాఖపట్నం: ప్రభుత్వ క్వీన్‌మేరీ పాఠశాలలో వేదాంత వీజీసీబీసంస్థ కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని, సౌర విద్యుత్ ప్రాజెక్టును మంగళవారం ప్రారంభించింది. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన ద్వారా 500 మంది బాలికలకు ఈ ప్రయోజనం చేకూరనుంది. 9 కంప్యూటర్లను పాఠశాలకు అందించింది. సౌరవిద్యుత్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. చైతన్య స్రవంతి వ్యవస్థాపక చైర్‌పర్సన్ డాక్టర్ షిరీన్ రెహ్మాన్ ప్రారంభించారు. వేదాంత ఐరన్ అండ్ స్టీల్ సెక్టార్ సీఈవో సౌవిక్ మజుందార్, మండల విద్యాశాఖ అధికారి కొర్ర సువర్ణ, వార్డు నాయకులు సూరాడ తాతారావు, కదిరి అప్పారావు, వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ సీఈవో సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.