ముంబై: భారతదేశపు అతిపెద్ద వాణిజ్యవాహనాల తయారీదారు, టాటామోటర్స్, ‘ట్రక్‌ఉత్సవ్’ ప్రారంభాన్ని ప్రకటించింది ఇది ఒక ప్రత్యేక వినియోగదారు ఎంగేజ్మెంట్ కార్యక్రమం. తన ఆధునిక వాహనాలు, మొబిలిటి పరిష్కారాల గురించి అవగాహనను కలిగించడం, విలువ-జోడిరచిన సేవలతో నూతన, సాంకేతికంగా-ఆధునికమైన ట్రక్కులను ప్రదర్శించడం ఈ ట్రక్ ఉత్సవ్ లక్ష్యం. అలాగే టాటా మోటర్ వినియోగదారుడి లాభదాయకతలో కొత్త బెంచ్ మార్కులను ఏర్పరచుటకు తయారు చేయబడిన ఒక నూతన క్లాస్-లీడిరగ్ చేరిక అయిన ఎల్‌పిటి 1916ను కూడా ఆవిష్కరించింది. ట్రక్ ఉత్సవ్ ద్వారా వినియోగదారులు తమ నిర్దిష్ట అవసరాల కొరకు తయారు చేయబడిన టాటా మోటర్ ఆధునిక మొబిలిటి పరిష్కారాలతో ప్రయోజనం పొందుతారు. సులభమైన, సౌకర్యవంతమైన వాహనఫైనాన్సింగ్‌కు ఫైనాన్సింగ్ భాగస్వాములతో ఎంగేజ్ అయ్యే అవకాశాన్ని కూడా అందిస్తుంది.