Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ప్రపంచ కాఫీ ఎక్స్‌పోలో హట్టి కాఫీ సువాసనలు

బెంగళూరు: భారతదేశంలో ఎక్కువ మందికి ఇష్టమైన సాంప్రదాయ హ్యాండ్‌ మేడ్‌ దక్షిణ భారత ఫిల్టర్‌ కాఫీ, హట్టి కాఫీ త్వరలో బెంగళూరులో జరగనున్న వరల్డ్‌ కాఫీ కాన్ఫరెన్స్‌ అండ్‌ ఎక్స్‌పో 2023 (డబ్ల్యుసీసీ2023)లో తన సత్తా చాటడానికి పూర్తిగా సిద్ధమైంది. గత 14 ఏళ్లలో భారతదేశంలోని 9 నగరాల్లో 150పైగా అవుట్‌లెట్‌లకు పెరిగిన బ్రాండ్‌, కొత్త మార్కెట్లలో విస్తరణ లక్ష్యంగా కొత్త భాగస్వామ్యాలను ఇక్కడ ఏర్పరుచుకోనుంది. హట్టి కాఫీ వ్యవస్థాపక డైరెక్టర్‌, సీఈఓ మహేందర్‌ మాట్లాడుతూ, తాము వరల్డ్‌ కాఫీ కాన్ఫరెన్స్‌ అండ్‌ ఎక్స్‌పో 2023లో భాగమైనందుకు సంతోషిస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img