న్యూదిల్లీ: జేఎల్‌ఆర్ ఇండియా భారతదేశంలో కొత్త, మెరుగుపరచబడిన రేంజ్ రోవర్ వెలార్‌ను అధికారికంగా ప్రారంభించింది. రేంజ్ రోవర్ వెలార్ అనేది ఆధునిక లగ్జరీ స్వచ్ఛమైన వ్యక్తీకరణ, తాజా సాంకేతికత, ట్రేడ్‌మార్క్ రేంజ్ రోవర్ రిఫైన్‌మెంట్, డ్రమటిక్, క్లీన్, సరళతలను అందించే కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. కొత్త రేంజ్ రోవర్ వెలార్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో డైనమిక్ హెచ్‌ఎస్‌ఇలో అందుబాటులో ఉంటుంది-2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 184 కేడబ్ల్యు, 365 ఎన్‌ఎం టార్క్, 2.0 ఇంజినియం డీజిల్ ఇంజన్ 150 కేడబ్ల్యు, 430 ఎన్‌ఎం టార్క్ వుంటుందని జేఎల్‌ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా అన్నారు.