బెంగళూరు: ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ఐఎస్‌ఆర్‌ఎల్)తో తన అద్భుతమైన భాగస్వామ్యాన్ని టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం) కొనసాగిస్తోంది. తమ ప్రతిష్టాత్మకమైన హిలక్స్‌ను దాని అధికారిక వాహన భాగస్వామిగా ప్రదర్శిస్తోంది. భారతదేశంలో నిర్వహిస్తున్న ఐఎస్‌ఆర్‌ఎల్ ప్రపంచంలోని మొట్టమొదటి ఫ్రాంఛైజీ-ఆధారిత సూపర్‌క్రాస్ లీగ్‌గా గుర్తించబడిరది. ప్రతిష్టాత్మక హిలక్స్ మరపురాని అనుభవాలను సృష్టిస్తూ, ప్రేక్షకులను ఆకర్షించింది. దేశవ్యాప్తంగా మోటర్‌స్పోర్ట్స్, ఆటోమొబైల్ ఔత్సాహికులకు కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేసింది. వరుసగా పూణే (జనవరి 2024), అహ్మదాబాద్ (ఫిబ్రవరి 2024)లో జరిగిన మొదటి, రెండవ రౌండ్ల తరువాత, ఐఎస్‌ఆర్‌ఎల్ తన మూడవ దశను ఫిబ్రవరి 25, 2024న బెంగుళూరులోని చిక్కజాల ఓపెన్ గ్రౌండ్ (ఎయిర్‌పోర్ట్ రోడ్)లో ముగించింది. ఈ చివరి రౌండ్‌కు 7000కి పైగా అభిమానులు పాల్గొనడంతో అపూర్వ విజయం సాధించింది. భారతదేశంలో ఆఫ్-రోడిరగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణ వెల్లడిరచింది.