Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

విస్తరణ దిశగా టీటీటీఐ

బెంగళూరు: స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌(టీకేఎం) బిదాదీలో తన టొయోటా టెక్నికల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీటీటీఐ)ని విస్తరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సామాజిక అభివృద్ధి, ఉపాధి, పురోగతి కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలు, నైపుణ్యతతో కూడిన టెక్నీషియన్లుగా మార్చేందుకు కర్నాటకలోని గ్రామీణ యువతకు సాధికారత కల్పించే దిశగా ప్రస్తుత టీటీటీఐ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెప్పడానికి ఈ విస్తరణ ఒక ఉదాహరణ అని టీకేఎం ప్రతినిధులు తెలిపారు. బిదాదీలో జరిగిన కార్యక్రమంలో టీటీటీఐ విస్తరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, పార్లమెంటు సభ్యులు డీకే సురేష్‌, స్థానిక ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ, పోర్టులు, రవాణా శాఖ మంత్రి మంకల్‌ ఎస్‌ వైద్య, చీఫ్‌ కప్లయిన్స్‌ ఆఫీసర్‌, టీకేఎం కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు స్వప్నేశ్‌ ఆర్‌ మారు, సీనియర్‌ ఉపాధ్యక్షులు సుదీప్‌ ఎస్‌ దాల్వీ, జీ.శంకర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img