న్యూఢల్లీి: విశ్వసనీయమైన ప్రపంచ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన రిటైల్ అనుభవాన్ని అందించాలనే దృఢనిబద్ధతతో తాజాగా ఢల్లీిలో తన మొదటి, అతిపెద్ద అనుభవపూర్వక స్టోర్‌ను ప్రారంభించింది. వివో ఇండియా దేశం అంతటా 200 కంటే ఎక్కువ స్టోర్లతో విశేషమైన ఉనికిని చాటుకుంటూ, గుజరాత్‌కు చెందిన ప్రముఖ రిటైల్ మొబైల్ ఫోన్ అయిన కోర్ మొబైల్‌తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కలిగిఉంది. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ సేల్స్ అండ్ సర్వీస్ స్టోర్ 2800 చదరపు అడుగుల కంటే ఎక్కువ రిటైల్ ప్రాంతాన్ని కలిగిఉంది. ఇది ఆల్ ఇన్ వన్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది సేవాకేంద్రం కోసం ప్రత్యేకస్థలం, ఉత్పత్తి అనుభవాలు, ప్రీమియంసేవలు, ఉపకరణాలు, ఐఓటీ, ఎక్స్ సిరీస్ గేమింగ్, తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ, డార్క్ జోన్, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం కార్యాచరణ జోన్లనుకలిగిఉంటుంది.