Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వివో టీ1ఎక్స్‌ విడుదల

ముంబయి: గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వివో తాజాగా భారతదేశంలో వివో టీ1ఎక్స్‌ను ప్రారంభించడంతో దాని సిరీస్‌ టీ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసింది. వివో టీ1ఎక్స్‌ ప్రో దాని శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌, 4-లేయర్‌ కూలింగ్‌ సిస్టమ్‌తో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. వివో టీ1ఎక్స్‌ కేవలం 8ఎంఎం స్లిమ్‌ డిజైన్‌ను 2.5డీ ఫ్లాట్‌ ఫ్రేమ్‌తో అందిస్తుంది. ఇది ప్రీమియం, సౌకర్యవంతమైన ఇన్‌-హ్యాండ్‌ అనుభూతిని అందిస్తుంది. రూ. 11,999/- (4జీబీG 64జీబీ), రూ.12,999/- (4జీబీG 128జీబీ), రూ. 14,999/- (6జీబీG 128జీబీ) ధరతో ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్రావిటీ బ్లాక్‌, స్పేస్‌ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌, వివో ఇండియా ఇ-స్టోర్‌, అన్ని పార్టనర్‌ రిటైల్‌ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అలాగే, ప్రత్యేకమైన ఆఫర్లు కూడా వున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img