Homeతెలంగాణఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకలు...

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకలు…

- Advertisement -

కన్నుల పండుగల జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవం..

వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ బిఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి..

విశాలాంధ్ర, శామీర్ పేట్ :- శామీర్‌పేట్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కల్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ధితో పాటు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తుంకుంట పట్టణ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్ రెడ్డి, డిసీఏంసీ రామిడి మధుకర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ అనిత లాలయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు