విశాలాంధ్ర- గూడూరు : గూడూరు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆలూరి ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ జన్మదిన వేడుకలను గూడూరు పట్టణ కన్వీనర్ గజేంద్ర గోపాల్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాణాసంచా. పేల్చి కేకు కట్ చేసి టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయ రాఘవరెడ్డి ,సుందర్రాజుః, గుడిపాడు భాస్కర్ రెడ్డి, మునగాల గోపాల్, కళ్యాణ్ రఘు, తులసి కృష్ణ, నాగప్ప యాదవ్, సులేమాన్ , వెంకట రాముడు, తెలుగు వేణు, ఇబ్రహీం భాష, గడ్డం మనీ, గురు శ్రీనివాసులు, అప్పన్న గారి మద్దిలేటి తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.